udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:41 pm Digital Edition : UDYAMA VAARTHA

రైతుల్ని మోసం చేయాలంటే వణుకు పుట్టాలి-సోమిరెడ్డి

టి పి గూడూరు ఉద్యమ వార్త మార్చి 30.

తోటపల్లి గూడూరు మండలంలోని పేడూరు రైతులను మోసం చేయాలంటే వణుకు పుట్టాలని సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలసి ఆయన పేడూరు లో పర్యటించారు ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ
పుట్టికి 950 కిలోల వరకు తీసుకోవడం దుర్మార్గం మిల్లర్లు,దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే రైతు మరింత నష్టపోతారుప్రతి రైతుకు కనీస మద్దతు ధర లభించాలని గోతాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచడంతో పాటు ట్రాక్టర్లకు జీపీఎస్ నిబంధన తొలగించాలని సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరారు.అనంతరం.తోటపల్లిగూడూరు మండలం పేడూరులో పర్యటించి రైతులను పలకరించిన మంత్రి మనోహర్,ఎమ్మెల్యే సోమిరెడ్డి,కలెక్టర్ హిమాన్షు శుక్లా,జేసీ వెంకటేశ్వర్లు,టీడీపీ, జనసేన నాయకులు,కళ్లాళ్లో ఆరబెట్టిన ధాన్యాన్ని, వరికోతలను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడిన మంత్రి మనోహర్ పేడూరు పర్యటనతో పాటు కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టాల్సిన చర్యలను మంత్రులు మనోహర్, రామనారాయణ రెడ్డి,కలెక్టర్ హిమాన్షుశుక్లా దృష్టికి తెచ్చిన సోమిరెడ్డి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని వ్యాపారులు, దళారులు దోచుకోవడం దుర్మార్గం ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది దళారులు రైతుల దగ్గర తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎం.ఎస్.పీకి అమ్ముకుంటున్నారు ప్రభుత్వం 24 గంటల్లోనే రైతులకు నగదు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన 2,3 గంటల్లోనే నగదు జమవుతోంది పుట్టి అంటే 860 కిలోలుగా దశాబ్దాలుగా ప్రామాణికం కొనసాగుతోంది నెమ్ము ఉంటే 20,30 కిలోలు అదనంగా తీసుకుంటే సరేకానీ 100 కిలోలు ఎందుకివ్వాలి రైతుల వద్ద అక్రమంగా అదనంగా ధాన్యం దోచుకుంటున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి గోతాల కొరత లేకండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే గోతాలు అందుబాటులో ఉంచాలి ధాన్యం తీసుకెళ్లే ట్రాక్టర్లకు జీపీఎస్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయయకులు,కార్యకర్తలు
పాల్గొననున్నారు.