udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 8:01 pm Digital Edition : UDYAMA VAARTHA

రెండు పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత

వాకాడు,ఉద్యమ వార్త; మే 15.

తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో ఇంటి పెద్దలను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రెండు కుటుంబాలకు శ్రీ సీతారామధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు,ప్రోత్సాహకులు,ప్రవాస భారతీయులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి,హైమావతమ్మ,మధు కిరణ్ రెడ్డి ల ఆర్థిక సహకారంతో ఆలయ ధర్మకర్తలు మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా ఇరవై అయిదు వేల రూపాయలను అందజేశారు.ఈ సందర్భంగా దామోదరరెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రెండు కుటుంబాలకు విదేశాలలో ఉన్నప్పటికీ ఆర్థిక చేయూతనందించిన దాతలకు,సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు మాట్లాడుతూ పుష్పగిరి రాధాకృష్ణమూర్తి అకాల మరణంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి కుటుంబానికి సత్యసాత్విక్ కు పదిహేను వేల రూపాయలు, విస్సా సుబ్రహ్మణ్య శర్మ, నాగరత్నమ్మ దంపతుల మరణంతో ఆర్థికంగా అసౌకర్యంగా ఉన్న వారి కుటుంబానికి రూపేష్ శర్మకు పదివేల రూపాయలు దాతల దాతృత్వంతో అందించడం జరిగిందన్నారు.దాతలకు ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో ఆమంచర్ల అశోక్ కుమార్,నాసిన హరీష్,శిరీష,శ్రీరామసేన సభ్యులు హరీష్,శివకుమార్,వంశీ,పవన్,వినయ్, తేజ తదితరులు పాల్గొన్నారు.