తోటపల్లి గూడూరు, ఏప్రిల్ 6 ఉద్యమ వార్త
అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తోటపల్లి గూడూరు మండల యువ నేతలు మొగలిగుంట పోతన హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే ఘట్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ సంకల్పబలం ఫలితంగానే అమరావతికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు.రాజధాని సాధన కోసం రైతులు చేసిన త్యాగాలకు ఇది సరైన గౌరవమని,ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని పోతన అన్నారు.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృషిని కూడా ప్రశంసిస్తూ, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కూటమి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.