udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 9:16 am Digital Edition : UDYAMA VAARTHA

మీ పాలనలో ఎం చేశారని జువ్వలదిన్నెకు వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి- ఎమ్మెల్యే సునీల్ కుమార్.

గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 13.

గూడూరు పట్టణం గత మీ పాలనలో ఎం చేశారని జువ్వలదిన్నెకు వస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ప్రశ్నించారు సోమవారం క్యాంప్ కార్యాలయం నందు ప్రెస్ మీట్ నిర్వహించిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులుడాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ
నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో అటానమస్ మారిటైం షిప్ యార్డ్, సిస్టమ్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు ద్వారా దేశంలోనే తొలి అటానమస్
షిప్ యార్డ్ ను జువ్వల దిన్నె లో అభివృద్ధి చెందుతుంది.
దీని ద్వారా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంసాంకేతిక సామర్థ్యాల అభివృద్ది,45 కోట్ల పెట్టుబడితో వెయ్యి
మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం.ఇది ఏర్పాటు చేయడంతో షిప్ బిల్డింగ్,మెరైన్ ఇంజనీరింగ్, పరిశోధనఅభివృద్ధి రంగాలలో యువతకు అవకాశాలు వస్తాయి.288.80 కోట్ల పెట్టుబడితో షిప్పింగ్ హార్బర్ ఏర్పాటు చేశాం.దీని వలన 25 వేల మత్సకార కుటుంబాలు జీవితాలు మారుతాయి.
ప్రతి ఏడాది ఈ హార్బర్ ద్వారా 41 వేల టన్నుల చేపల దిగుబడి జరుతుందని సునీల్ కుమార్ తెలిపారుఅభివృద్ది ని అడ్డు కోవడమే లక్ష్యంగా వైసిపి కుట్రలు చేస్తుందనిగతంలో ఐదు ఏళ్ళ లో ఒక హార్బర్ ను అయిన ఏర్పాటు చేశారా
ఇక్కడకు వచ్చే పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు.కియా పరిశ్రమ వాల్లని బెదిరించారు, అమరరాజ కంపెనీ పై నిందలు వేసితెలంగాణకు తరిమేశారు.మీరు ఏమి చేశారనిఈ నెల 15న జువ్వల దిన్నె వస్తున్నారు
ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కొస్తున్నారు.గతంలో మీరు ఇచ్చిన అడ్డగోలు GOల వలన రామాయపట్నం పోర్ట్ తోపాటుగా
జువ్వలు దిన్నెలో హర్బర్ కట్టే అవకాశం లేకుండ పోయింది.
130 కోట్లు కేంద్రం నిధులు 150 కోట్లు రాష్ట్రం విధులు కలిపి ఈ రోజు
288 కోట్లతో షిపింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నాం.128 ఎకరాలలో 200 పైగా బోట్లు నిలిచేల హార్బర్ నిర్మాణం చేస్తున్నాంYCP వాళ్ళకు జువలదిన్నె గురించి మాట్లాడే అర్హ్వత లేదని అన్నారు.