udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 10:18 pm Digital Edition : UDYAMA VAARTHA

మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలు పంపిణీ.

వాకాడు, ఉద్యమ వార్త; మే 3.

వాకాడు మండలంలోని జమీన్ కొత్తపాలెం లో ఆదివారం మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం జరిగింది తన మాతృమూర్తిపై మమకారంతో సమాజ సేవలో ఆదర్శంగా మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నిలిచిపోయాయి తల్లి జ్ఞాపకార్థం సేవ యజ్ఞంగా ఆయన గంగన్న పాలెం,తూపిలి పాలెం, బాలిరెడ్డిపాలెం, జెమిని కొత్తపాలెం, వాలిమేడు గ్రామాల్లో ఉచిత కంటి అద్దాల పంపిణీ చేశారు గత నెలలో తల్లి జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కంటి చూపు సమస్యలు ఉన్నవారికి కంటి చూపు ప్రసాదం మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కల్పించారు నెల్లూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎల్.వి.ప్రసాద్ సంస్థ సహకారంతో చూపు సమస్య ఉన్న 73 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించారు మారం రెడ్డి సుగుణమ్మ స్మారకార్థం నిరుపేదల కోసం ​రూపాయి ఖర్చు లేకుండా కంటి చూపు కల్పించాలని మారుమూల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం కిరణ్ కుమార్ రెడ్డి సేవా తత్వానికి నిదర్శనం గత నెలలో గంగన్న పాలెం గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న 120 మందిలో 30 మందికి కంటిలో శుక్లాలు గుర్తుంచి వారికి ఉచితం గా ఆపరేషన్ చేయించారు అలాగే పరీక్షల్లో కంటి చూపు సమస్య ఉన్నట్లు గుర్తించిన 73 మంది లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు.
వైద్య బృందం సహకారం ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ కో-ఆర్డినేటర్ అనూబ్ బాబు నేతృత్వంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది.
ప్రముఖుల సమక్షం ఈ కార్యక్రమంలో మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మండల పరిషత్ ఉపాధ్యక్షులు వెంకట రమణయ్య, తిరుమల శెట్టి కోటేశ్వర రావు,ఎల్.వి. ప్రసాద్ సంస్థ కో-ఆర్డినేటర్ అనూబ్ బాబు, నెల్లిపూడి కోటయ్య పాల్గొని లబ్ధిదారులకు అద్దాలను పంపిణీ చేశారు.​తమ గ్రామాల్లోనే శిబిరం ఏర్పాటు చేసి,రూపాయి ఖర్చు లేకుండా కంటి అద్దాలు అందించడం పట్ల గంగన్న పాలెం, తూపిలి పాలెం,బాలిరెడ్డిపాలెం,జెమిని కొత్తపాలెం, వాలిమేడు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లి జ్ఞాపకార్థం కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని స్థానిక నేతలు కొనియాడారు.