udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 1:55 am Digital Edition : UDYAMA VAARTHA

మరోసారి మానవత్వం చాటుకున్న-జలీల్ అహ్మద్.

కోట ఉద్యమ వార్త మార్చి 14

కోట మండల కేంద్రంలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న చిన్నారి అనారోగ్య కారణంగా పాఠశాలలోనే ఫిట్స్ వచ్చి పడిపోతే హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు ప్రధమ చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి చిన్నారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని గమనించిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 10 వేలు రూపాయలను గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సూచనల మేరకు చిన్నారి తల్లిదండ్రులకు అందించారు దీంతో వారు చిన్నారులే వైద్యం చేయించేందుకు చెన్నైకి తీసుకెళ్లారు పేదవారు ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న నేనున్నానంటూ ముందుండే మానవతా మూర్తి షేక్ జలీల్ అహ్మద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు.