udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 8:46 pm Digital Edition : UDYAMA VAARTHA

“బాబా సాహెబ్ కు సునీల్ కుమార్ ఘన నివాళి”

గూడూరు,ఉద్యమ వార్త; ఏప్రిల్ 14.

భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా గూడూరు శాసన సబ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఘన నివాళి అర్పించారు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిఅనంతరం పేద మహిళ ళలకి చీరలు పంపిణీ చేశారు, అంబేద్కర్ విగ్రహానికి లైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే ప్రభుత్వ హాస్పిటల్ నందు ఎమ్మార్పీఎస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు,అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కటింగ్ చేశారు,టవర్ క్లాక్ సెంటర్ నందు మై ఫ్రెండ్లీ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు,అనంతరం వివేకానంద రోడ్డు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి 135వ జయంతి ఘన నివాళి అర్పించారు,అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక,సమానత్వం,కోసం పోరాడిన మహానేత బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు,సమాన అవకాశాలు, హక్కులు అందించి,ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించిన మహోన్నత నేత అంబేద్కర్ అని అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకుంటున్నారని తెలిపారు అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని తెలిపారు,ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉండి, ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశారని
అంబేద్కర్ అంటరానితనం,కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, మహిళా సాధికారత మరియు కార్మిక హక్కుల కోసం అనేక సంస్కరణలు తెచ్చారని అంబేద్కర్ 64 సబ్జెక్టులలో పట్టు సాధించి,9 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన అరుదైన మేధావి అని
బోధించు,సమీకరించు, పోరాడు”అనే ఆయన నినాదం నేటి యువతకు నిరంతర స్ఫూర్తిదాయకం అని సునీల్ కుమార్ తెలిపారు స్వతంత్ర భారత తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించి, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు నేటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగ విలువల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారుఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా మహనీయుడు అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అడుగులు వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు,రాజ్యాంగబద్ధంగా బడుగు,బలహీన వర్గాలకు,రాజకీయ అవకాశం కల్పించడమే కాకుండా,రిజర్వేషన్లకు అతీతంగా మరి ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించి, సామాన్యుడు,బీద, బడుగు,బలహీన వర్గాలకు చెందినవారు, రాజ్యాధికారం వైపు అడుగులు వేసే విధంగా తీసుకున్న చొరవ భావితరాలకు ఆదర్శం మహనీయుడు బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు.