ముత్తుకూరు నిడిగుంటపాలెం ఉద్యమ వార్త మార్చి 2
అమెరికాలో ఉన్న ఆయన ధ్యాసంతా జన్మస్థలం ప్రగతి పైనే అభివృద్ధితో పాటు సేవాకార్యక్రమాల్లో ఆదర్శప్రాయులు చెన్నైశంకరనేత్రాలయ వారితో కలిసి నిర్వహిస్తున్న కంటి శస్త్రచికిత్స శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి వెంకటాచలం
మండలం నిడిగుంటపాళెంలో ననమాల ప్రేమ్ సాగర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కంటి శస్త్ర చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిడిగుంటపాళెం హైస్కూలులో చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటించిన సోమిరెడ్డి మొదట ననమాల సుందరరామిరెడ్డి విగ్రహానికి నివాళి
శంకర నేత్రాలయం వారితో కలిసి ప్రేమసాగర్ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన కంటి శస్త్రచికిత్స శిబిరం పది రోజుల పాటు కొనసాగుతుంది
సొంతూరిపై ప్రేమతో ప్రేమసాగర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు
చదువుకునే చిన్నబిడ్డలకువసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం శుభపరిణామం తండ్రిసుందరరామిరెడ్డి పేరుతోహైస్కూలు నిర్వహిస్తున్నారు ఈ స్కూలు ప్రాంగంలో అభివృద్ధికార్యక్రమాలకు రెండేళ్లలో రూ.4.50 కోట్లు ఖర్చు పెట్టారు
సుమారు రూ.5 కోట్ల నిదులతో గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించడంతో పాటు మినరల్ వాటర్ ప్లాంటుఅందుబాటులోకి తెచ్చారుస్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు ఉపయోగపడేలా14 గదులతో సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మించారుదీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కల్యాణ యోజన కింద పదో తరగతి పాసైన 60 మందివిద్యార్థినులకు ఆర్నెళ్లపాటుస్కిల్ డెవలప్మెంట్ట్రైనింగ్ ఇవ్వనున్నారు
ఇదే పథకం కిందబిల్డింగ్ ను అప్రూవల్ చేయాలని మంత్రి నారా లోకేష్ బాబు,కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డిని ఇప్పటికే కోరాను సానుకూలంగా స్పందించారు
వీలైనంత త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్అందుబాటులోకి రానుంది ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడకార్యక్రమాలు నిర్వహిస్తున్న రవీంద్రరెడ్డి,శ్రీహరిరెడ్డికి ధన్యవాదములు ఈ ప్రాంతప్రజలందరి తరఫున ప్రేమ్ సాగర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
దేశవిదేశాల్లో స్థిరపడిన ఎన్.ఆర్.ఐలు ప్రేమ్ సాగర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సొంతూర్ల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను