udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 6:09 am Digital Edition : UDYAMA VAARTHA

ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత అధికారులదే-సోమిరెడ్డి

తోటపల్లి గూడూరు,
ఉద్యమ వార్త మార్చి 31.

తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డి పాలెంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం పర్యటించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత  అధికారులదేనాని బాటలు,కాలువ కట్టలు,శ్మశానాలు ఆక్రమణకు గురవుతుంటే ఏం చేస్తున్నట్టు ఆక్రమణల తొలగింపు విషయంలో కఠినంగా వ్యవహరించాలి
తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డిపాళెంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాపిరెడ్డిపాళెంలో రూ.43 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లతో పాటు సర్పంచ్ కదురు వెంకట సుబ్బయ్య కట్టించిన రెండు చావిడిలను ప్రారంభించిన సోమిరెడ్డి శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురైన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన గ్రామస్తులు ఆక్రమణల తొలగింపునకు వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సోమిరెడ్డి ఆదేశం శ్రీ కనకమ్మ దేవస్థానాన్ని, శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజల నిర్వహణ మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ మా సొంతూరితో సమానమైన పాపిరెడ్డిపాళెంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది ఈ గ్రామ అభివృద్ధికి ఆల్తూరి మహేష్ రెడ్డి, గిరీష్ రెడ్డి అండదండలు కూడా ఎప్పుడూ ఉంటాయి
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ గ్రామంలో రూ.2.50 కోట్ల నిధులతో చాలా అభివృద్ధి పనులు చేశాం ఈ రోజు కూడా రూ.43 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాం శ్మశాన అభివృద్ధి పనులకు శాంతా బయోటెక్ అధినేత రూ.10 లక్షలు అందిస్తానని ప్రకటించారు శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురైందని గ్రామస్తులు నా దృష్టికి తెచ్చారు వెంటనే ఆక్రమణలు తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా రక్షించాల్సిన బాధ్యత అధికారులదే అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.