udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 5:32 am Digital Edition : UDYAMA VAARTHA

ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలి- పాసిం సునీల్ కుమార్

గూడూరు ఉద్యమ వార్త మార్చి 8

ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలి అని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణం వనజా కృష్ణ కల్యాణ మండపం నందు మహిళలతో సమావేశమై నియోజకవర్గం పరిధిలో ఉన్న 3266 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా అందిస్తున్న 304 కోట్ల 53 లక్షల 50 వేల రూపాయల చెక్కు ను అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళల జీవనోపాధి, స్వేచ అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పతకాలను అమలు చేస్తుందని ప్రతి మహిళా పారిశ్రామిక వేత్త కావాలన్న ఆకాంక్ష 2025-26 సంవత్సరంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలగా తీర్చిదిద్దుతుంది
2026-27 సంవత్సరానికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మార్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
మహిళలకు 38 వేల కోట్ల ఆర్థిక రుణసాయం అందిస్తుంది మహిళలకు అవసరమైన ఆర్ధిక సాయం శిక్షణ అందించే దిశగా వివిధ పరిశ్రమలు,సంస్థలతో 36 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుoటున్నాంతల్లికి వందనం కింద 67 లక్షల 27 వేల 164 మంది విద్యార్ధులకు 10 వేల 90 కోట్ల 74 లక్షల రూపాయులు అందించింది ఉచిత బస్సు పథకం కింద మహిళలకు ఏడాదికి 296 కోట్లు ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు 50 కోట్ల ప్రయాణాలు జరిగాయి రాష్ట్రంలో 1.08 కోట్ల కుటుంభాలకు 3 సిలండర్ల లెక్కన 3.74 కోట్ల సిలిండర్లను కూటమి ప్రభుత్వం అందిస్తుంది మెగా DSC ద్వారా 7955 మంది మహిళలకు టిచర్ ఉద్యోగాలు మహిళా కానిస్టేబుల్ గా 993 మంది ఎంపిక అయ్యారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సుమారు మూడు గంటలసేపు సమయం మహిళలతో గడిపారు అనంతరం ఆయనే స్వయంగా మహిళలందరికీ భోజనం అందించారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.