udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 02 April 2026, 7:10 pm Digital Edition : UDYAMA VAARTHA

ప్రజా రాజధాని అమరావతి కి చట్ట బద్దత-సునీల్ కుమార్.

గూడూరు పట్టణం,ఉద్యమ వార్త;ఏప్రిల్ 02.

ప్రజా రాజధాని అమరావతి కి చట్ట బద్దత రాజధానికి పట్టిన గ్రహణం వీడిన సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలతో కలసి టవర్ క్లాక్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కు నివాళర్పించి,కొవొత్తులతో దీపా హరతులు ఇస్తూ టవర్ క్లాక్ సెంటర్ నుండి ముత్యాలపేట, రైల్వేస్టేషన్ మీదుగా దీపాహారతులతో ర్యాలీ చేసిన గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 కోట్ల ఆంద్ర రాష్ట్ర ప్రజల
ఆకాంక్ష అమరావతి రాజధాని ఏర్పాటు చట్ట బద్ధత చేసుకోవడం అని
తెలిపారు, అమరావతిని సాధించడం కోసం అహర్నిశలు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపిన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి చట్టబద్ధత కోసం ఆమోదం తెలిపిన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు అమరావతిలో రాజధాని లేకుండా చేసేందుకు కుట్రలు పడిన వైసీపీ పార్టీ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల పక్షాన నిలబడాలని ఆయన హితోపలికారు ప్రజా రాజధాని చట్టబద్ధత సాధించుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా తెలుగు వారందరూ సంబరాలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.