గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 6.
నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ,గూడూరు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పేద ప్రజలందరూ వైద్య నారాయణుడిగా భావిస్తున్న”డాక్టర్ సి.ఆర్.రెడ్డి పేరు మీద “డాక్టర్ సి,ఆర్, రెడ్డి ఆరోగ్య సంజీవని” అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్ళుగా పిలవబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి,డాక్టర్ రోహిణి సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధి బాధితులు అయిన 30 మందికి ప్రతినెల పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ లైఫ్ టైం ప్రాజెక్ట్ లో భాగంగా ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి వారంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నమని ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సూపరిడెంట్ జరీనా బేగం డాక్టర్ స్వాతి మేడం,నెల్లూరు నెట్వర్క్ పాజిటివ్ ప్రెసిడెంట్ ధనుర్జ, ప్రగతి కుటుంబ సభ్యులు వాకటి రామ్మోహన్రావు, పయ్యావుల మురళి నాయుడు,రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, వాచ్ షాప్ రాము, శ్యామ్,డిష్ నాగరాజు,కృష్ణారెడ్డి, వెంకట్రావు,నాగేంద్ర హాస్పిటల్స్ సిబ్బంది సాయి తదితరులు పాల్గొన్నారు.