udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 8:42 pm Digital Edition : UDYAMA VAARTHA

పేదల సేవలో కూటమి ప్రభుత్వం-సునీల్ కుమార్.

ఉద్యమవార్త,గూడూరు;ఏప్రిల్ 1.

పేదల సేవలో ప్రజల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని
గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తెలిపారు బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన గూడూరు మండలం మంగళపూరు గ్రామం నందు లబ్ధిదారులను కలసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే పెంచిన పెన్షన్ ను అందిస్తుందని తెలుపుతూ వారికి పెన్షన్ పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ఆనాడు పేదలకు పెంక్షన్  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పెన్షన్ పెంచి 4 వేలు,6 వేలు,10 వేలు,15 వేలు చొప్పున వికలాంగులు,ఒంటరి మహిళలకి పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేసి ఈరోజు ప్రతి కుటుంబంలో బాధ్యతగల ఒక ఇంటి పెద్దగా ప్రజల మనసులో నిలిచిపోయారు అని సునీల్ కుమార్ తెలిపారు అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతినెలా క్రమం తప్పకుండా పెంక్షన్ ఇస్తున్నామని ఒకటవ తేదీ సెలవు దినం అయితే ముందు రోజే పెన్షన్ ఇస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని ఆయన అన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కూటమి లక్ష్యమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.