udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 2:05 am Digital Edition : UDYAMA VAARTHA

పెన్షన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం- జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్.

కోట ఉద్యమ వార్త ఏప్రిల్1.

పెన్షన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం అని జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ తెలిపారు.కోట మండలకేంద్రంలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీ,శ్యాంసుందర పురం నందు బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు,గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ ఆదేశాలు మేరకు పెన్షన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం సంక్షేమ సారథి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు నినాదంతో కూటమి ప్రభుత్వం పేదలకు మంచి పని చేస్తుంది పేదలకు సంక్షేమం అందించటంలో వెనుకడుగు లేదు.పెన్షన్ల భరోసాకు ఆద్యుడు నాడు ఎన్టీఆర్ అయితే పెన్షన్ల పెంపుకు కారకుడు నేడు చంద్రబాబు నాయుడు అని దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఆంద్రప్రదేశ్ లో జరుగుతుంది సాధారణ పింఛన్లు రూ.4 వేలు వృద్ధాప్య,వితంతు పెన్షన్ రూ.6 వేలు దివ్యాంగ పెన్షన్ రూ.10 వేలు డయాలసిస్,మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు అందించడం బాబు అంటే భరోసా’ఇది ప్రజల నమ్మకం.దీన్ని మరోసారి నిరూపిస్తూ,ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు వివిధ రకాల పింఛన్లను పెంచి ఆయా వర్గాలకు సంతోషాన్ని, భరోసాని ఇచ్చారు పింఛన్ తీసుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శంషుద్దీన్,మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి సిద్దపరెడ్డి పోలమ్మ,తెలుగుదేశం పార్టీ బూత్ ఇంచార్జిలు తల్లం శ్రీనివాసులు, చిట్టి,నందం మోహన్,మండల సోషల్ మీడియా అధ్యక్షులు మీజురు మధు బాబు, మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి ఎంబేటి రూపేష్,మరియు సచివాలయం సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.