కోట ఉద్యమ వార్త మార్చి 29.
కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పెద గోవిందపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగాగూడూరు నియోజకవర్గ ఎస్.సి.సెల్ ఉపాధ్యక్షులు వాటంబేటీ చెంగల్ రావు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ అదేశాల ప్రకారం,టీడీపీ నాయకులు శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డి సూచనలు మేరకు కోట మండలం కొత్తపట్నం పంచాయతీ లోని పెద్ద గోవిందపల్లి గ్రామంలో తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి తెలుగువారి ఆత్మగౌరాయాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారికి కూడు గూడు గుడ్డ అందించడమే కాకుండా రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ఇచ్చారని మహిళలకు సమాన హక్కు కల్పించడం పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం రాష్ట్రాన్ని సుభిక్షంగా ప్రజలను క్షేమంగా చూసుకున్నారు ఆయన బాటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడుస్తున్నారని అభివృద్ధి ధ్యేయంగా ప్రజా క్షేమమే లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఎస్.సి.సెల్ ఉపాధ్యక్షులు వాటంబేటీ చెంగల్ రావు,కోట మండల యువత అధ్యక్షులు చల్లా సురేష్ కుమార్,
ఉయ్యాలమ్మ చెరువు చైర్మన్ కోమారి శివకృష్ణ గారు,కొత్తపట్నం పంచాయతీ ఉపాధ్యక్షులు ఇంగిలాల వెంకటకృష్ణయ్య,
ఇంగిలాల రాజగోపాల్, మరియు టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.