udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 4:57 am Digital Edition : UDYAMA VAARTHA

పింఛన్ పై విస్తుపోయే వాస్తవాలను వెల్లడించిన సోమిరెడ్డి

ఉద్యమ వార్త , అమరావతి ఫిబ్రవరి 24

ఏ విధంగా చూసుకున్నా పింఛన్ల విషయంలో రికార్డు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర జనాభాలో 12.88 శాతం మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్
అర్హులందరికీ పించన్ అందేలా చూడాలని కూడా ప్రభుత్వానికి విన్నపం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంపై అసెంబ్లీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఏపీలో అమలవుతోంది గత వైసీపీ ప్రభుత్వం నెలకు రూ.1400 కోట్లు ఖర్చు పెడితే, మన ప్రభుత్వం రూ.2750 కోట్లు ఖర్చుపెడుతోందిఅప్పట్లో ఏడాదికి రూ.16 వేల 800 కోట్లు ఖర్చుపెడితే, మనం రూ.32 వేల 500 కోట్లు ఖర్చు పెడుతున్నాంవైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.84 వేల కోట్లు ఖర్చుపెడితే, మన కూటమి ప్రభుత్వంలో ఒక లక్ష 68 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం వృద్ధులు, వితంతువు, దివ్యాంగుల పింఛన్ల కోసం ఐదేళ్లలో గత ప్రభుత్వం కంటే రూ.82 వేల కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నాం సూపర్ సక్సెస్ అయిన సూపర్ సిక్స్ పథకాలను వైసీపీ నేతలు ఎగతాళి చేయడం హాస్యాస్పదం జగన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో అమ్మఒడి పథకానికి రూ.32 వేల కోట్లు, జగనన్న దీవెన పథకానికి రూ.24 వేల కోట్లు ఖర్చుపెట్టారు..రెండూ కలిపినా రూ.56 వేల కోట్లు మాత్రమే మన కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క పింఛన్లకే రూ.82 వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది పింఛన్ల కోసం ఏపీ ప్రతి నెలా రూ.2725 కోట్లు ఖర్చు పెడుతుంటే..మహారాష్ట్ర రూ.320 కోట్లు,తమిళనాడు రూ.315 కోట్లు, కర్ణాటక రూ.392 కోట్లు, తెలంగాణ రూ.681 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.194 కోట్లు,కేరళ రూ.607 కోట్లు,ఒడిశా రూ.245 కోట్లు ఖర్చు చేస్తున్నాయి ఏడు పెద్ద రాష్ట్రాలు కలిసి నెలకు రూ.2754 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తుంటే, ఏపీ ఒక్కటే ఖర్చు చేస్తున్న మొత్తం రూ.2725 కోట్లు రాష్ట్ర జనాభాలో 12.88 శాతం మంది పింఛన్లు పొందుతున్నారు ఇది ఆషామాషీ విషయం కాదు పింఛన్ బీహార్ రూ.400, బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటక రూ.600, ముంబై మహానగరం కలిగిన మహారాష్ట్ర రూ.1000, హైదరాబాద్ ఉన్న తెలంగాణ రూ.2 వేలు పింఛన్ ఇస్తున్నాయి గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ కలిపితే,మన కూటమి ప్రభుత్వం పింఛన్ల కోసం అధికంగా ఖర్చు చేస్తున్న రూ.82 వేల కోట్లను దాటడం లేదు అమ్మఒడి పథకానికి వైసీపీ ప్రభుత్వం ఐదారు వేల కోట్లు ఖర్చు పెడితే, మనం ఇప్పుడు తల్లికి వందనం పథకానికి రూ.9 వేల కోట్ల వరకు వెచ్చిస్తున్నాం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ పథకం ఒక్కటే, వైసీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నింటిని అధిగమిస్తోంది పెద్దాయన ఎన్టీఆర్ రూ.30తో పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టారు…చంద్రబాబు నాయుడు దానిని రూ.70కి పెంచారు..కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 చేస్తే, తిరిగి చంద్రబాబు నాయుడు ఆ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచి రికార్డు సృష్టించారు రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు పెంచేందుకు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పట్టింది కూటమి ప్రభుత్వం ఒకే సారి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడమే గాక హామీ ఇచ్చిన రోజు నుంచే అనగా మూడు నెలల ముందు నుంచే పథకాన్ని అమలులోకి తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది పింఛన్ గాఅందిస్తున్న రూ.4 వేలలో రూ2800 పెంచిన చరిత్ర చంద్రబాబు నాయుడిదే ఇది కచ్చితంగా ఆయన బ్రాండే మంచానికి పరిమితమైన వారికి నెలకు రూ15 వేలు చొప్పున పింఛన్ అందిస్తున్నాం..నెలకు రూ1.80 లక్షలు పొందుతున్నారు సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే వారు పొందే జీతం అంత మొత్తాన్ని ఆ లబ్ధిదారులు అందుకుంటున్నారు అయితే కొన్ని చోట్ల రూ.6 వేలు పొందాల్సిన వారు రూ15 వేలు తీసుకుంటున్నారు నిజంగా రూ15 వేలు పొందాల్సిన వారి దరఖాస్తులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి ఇన్చార్జి మంత్రుల కోటాలో ఇచ్చిన పింఛన్ల సంఖ్య పెంచి అర్హులందరికీ రూ15 వేలు మంజూరయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను కుటుంబంలో ఒక్కరు మంచానికి పరిమితమైతే మిగిలిన కుటుంబసభ్యులు పనికి కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు ఎవరో ఒకరు వెన్నంటి వుండి వారికి సేవలు చేయాల్సిన పరిస్థితి ఉంది మంచానికి పరిమితమైన వారి విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను అనర్హులకు పింఛన్ అందుతుంటే దానిని సీరియస్ గా తీసుకోవాలని స్పష్టం చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపింఛన్ల పంపిణీలో తనకు ఎదురైన అనుభవాలను కూడా సభ దష్టికి తెచ్చిన సోమిరెడ్డి అర్హత లేకపోయినా పింఛన్ పొందుతున్న వారి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ల దృష్టికి తేవాలని కోరిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్