udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 2:08 am Digital Edition : UDYAMA VAARTHA

పల్లె పల్లెలో రెపరెపలాడిన పసుపు జెండా-కేసవరంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుక.

కోట ఉద్యమ వార్త మార్చి 29.

కోట మండల కేంద్రంలోని కేసవరం పంచాయతీ లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులర్పించి బాణాసంచా వేడుకలతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సూచనలు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.1982 మార్చి 29న తెలుగు వాడి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు ప్రపంచ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించింది ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వ ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడు,గుడ్డ, గూడు ఉండాలని సంకల్పంతో విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దుచేసి మండల వ్యవస్థను తీసుకువచ్చారు రెండు రూపాయలకే కిలో బియ్యం అమలు చేసి ప్రతి పేదవాడికి అన్నం తినేలా ఏర్పాటు చేశారని మహిళలకి ఆస్తిలో సమాన హక్కులు కలిపించారని ఆయన ఆశయాలను ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు.కేశవరం గ్రామపంచాయతీలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురువేసిన కేశవరం చెరువు ఆయకట్టు ప్రెసిడెంట్ బతల బాబు చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు,కేశవరం జనసేన నాయకులు గురు బాబు,టీడీపీ నాయకులు మరిబోయిన కృష్ణయ్య,శ్రీరామ్ దామోదర్,శ్రీరామ్ జగన్నాధం,శ్రీరామ్ వెంకటేశ్వర్లు,కేశవరం మహేంద్ర,చాపల విష్ణు, చాపల గుర్రపా,చాపల వర్ధన్,పాల్గొనడం జరిగింది.