నేడు కోట లో విద్యార్థులకి సైకిళ్ళు పంపిణీ.
ముఖ్య అతిధులు గా..బీదా రవిచంద్ర, పాసిం సునీల్ కిమర్.
కోట ఉద్యమ వార్త ఏప్రిల్ 20.
ఈరోజు అనగా సోమవారం కోట AVKR ZP బాయ్స్ ఉన్నత పాఠశాల నందు ఉదయం 9:00 గంటల కి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసిం సునీల్ కుమార్ వస్తున్నారని తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ తెలిపారు సైకిళ్లు పంపిణీ
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగును,తదుపరి కోట అగ్నిమాపక స్టేషన్ నందు “నూతన అగ్ని మాపక వాహన” ప్రారంభం కార్యక్రమాలు జరుగును.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు,MLC బీద రవిచంద్ర , టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గూడూరు శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కావున కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన.పలగాటి భాస్కర్ రెడ్డి కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.షేక్ జలీల్ అహ్మద్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు.