udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:04 am Digital Edition : UDYAMA VAARTHA

నియోజకవర్గ సమస్యలు పవన్ కళ్యాణ్ కు వివరించిన సునీల్ కుమార్

అమరావతి ఉద్యమ వార్త ఫిబ్రవరి 24

సెంబ్లీ సమావేశాలలో భాగంగా మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని కలసి నియోజకవర్గంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందించిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్
రానున్న
వేసవికాలం దృష్ట్యా నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు సముద్ర తీర ప్రాంత ప్రజలు
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున రూరల్ వాటర్ సప్లై స్కీం కింద నిధులు మంజూరు చేయాలనీ ఆయన కోరారు అలాగే నియోజకవర్గంలో తీర ప్రాంత ప్రజలకు R&B రోడ్లు దెబ్బతిని రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని మరియు MGNREGS కింద కొన్ని పంచాయతీలలో CC రోడ్లు మంజూరు అయినప్పటికీ వేయుటకు అవి ఫారెస్ట్ మరియు వైల్డ్ లైఫ్ అనుమతులు కావాలని అధికారులు తెలుపుతున్నందున క్లియరెన్స్ అనుమతులు మంజూరు చేయాలనీ కోరారు మంత్రివర్యులు సానూకులముగా స్పందించి త్వరలో అనుమతులు మంజూరు చేస్తానని తెలిపారని అన్నారు.