వాకాడు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 7.
ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా బత్తిన ప్రమీల నియామకం.తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా గూడూరు నియోజకవర్గo వాకాడు మండలానికి చెందిన బత్తిన ప్రమీల నియమితులయ్యారు.ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన సామాన్య కార్యకర్తకు,అదీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు ఇంతటి ఉన్నతమైన ఆధ్యాత్మిక పదవి దక్కడం పట్ల నియోజకవర్గవ్యాప్తంగా సర్వత్రాహర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఐ టి మరియు విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు
నాయకత్వంలో సామాన్య కార్యకర్తలకు సైతం సముచిత గుర్తింపు లభిస్తుందని ఈ నియామకం ద్వారా మరోసారి నిరూపితమైంది.టీడీపీ సీనియర్ నాయకులు కొండేటి గంగా ప్రసాద్ మరియు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ప్రత్యేక సహకారంతో గూడూరు ప్రాంత మహిళకు ఈ ఉన్నత పదవి దక్కింది.నిరుపేద నేపథ్యం ఉన్న ప్రమీలను అక్కున చేర్చుకుని, పవిత్రమైన దేవస్థాన బోర్డులో స్థానం కల్పించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు మరియు పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా
బత్తిన ప్రమీల మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈబాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,లోకేష్ బాబుకి,అలాగే తన ఎదుగుదలకు సహకరించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్,సీనియర్ నాయకులు గంగా ప్రసాద్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తన వంతు కృషి చేస్తానని, ఆలయ అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తానని ఆమె ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.సామాన్య భక్తుల గొంతుకగా బోర్డులో పనిచేస్తూ, భక్తుల సేవయే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ప్రమీల నియామక వార్త తెలియగానే వాకాడు మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆమె శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన మహిళకు ఈ స్థాయి గౌరవం దక్కడం ఆ ప్రాంతానికే గర్వకారణమని స్థానిక నేతలు పేర్కొన్నారు. ఈ నియామకానికి సహకరించిన వాకాడు మండల నాయకులకు మరియు పార్టీ కార్యకర్తలకు ప్రమీల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.