udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 8:41 pm Digital Edition : UDYAMA VAARTHA

దేశంలోనే నంబర్ 1 రాజధానిగా అమరావతి-సోమిరెడ్డి.

మనుబోలు, ఉద్యమవార్త;ఏప్రిల్ 03.

దేశంలోనే నంబర్ 1 రాజధానిగా అమరావతి రూపు దిద్దుకుంటుంది అని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు శుక్రవారం మనుబోలులో నిర్వహించిన అమరావతి విజయోత్సవ ర్యాలీలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల తో కలిసి
మనుబోలులో ఎస్సీ కాలనీ అంబేద్కర్ విగ్రహం నుంచి కోదండరామపురం సెంటర్ వరకు ర్యాలీ విజయోత్సవంలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి ని వ్యతిరేకించే వారికి దేవుడే బుద్ధిచెప్పాడు
దేశంలోని 11 పార్టీలు అమరావతిని ముక్తకంఠంతో సమర్ధిస్తే,అసెంబ్లీలో 11 సీట్లున్న జగన్ రెడ్డి పార్టీ పార్లమెంటు నుంచి పారిపోయింది మావిగన్ తో సరిపెట్టాడు పులివెందుల గన్ అనలేదు సంతోషం తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన అమరావతి మహిళా రైతులను భోజనం కూడా ప్రశాంతంగా తిననీయకుండా ఆనాటి మంత్రి కాకాణి వేధించాడు టెంట్లను పెరికించేసి నడిరోడ్డుపై అవమానకరంగా కూర్చోపెట్టాడు రైతుల త్యాగాలు, కష్టాలు వృథా కాలేదు దేశంలోనే నంబర్ 1 రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుంది
సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం విషయంలో అద్భుత ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రమంతా రుణపడివుంది చేరెడ్డి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో 200 మంది గిరిజనులకు చీరల పంపిణీ సోమిరెడ్డి మాట్లాడుతూ
ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ పార్లమెంటు చట్టం చేయడం సంతోషం
రాష్ట్ర ప్రజలందరికీ ఇది గర్వకారణం
కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి మనమంతా రుణపడివున్నాం
సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత, మంత్రి నారా లోకేష్ బాబు కృషితో అమరావతికి రాజముద్ర పడింది
అమరావతిని రాజధానిగా ఆమోదించే చట్టానికి దేశంలోని 11 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి
అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో 11 సీట్లు ఉన్న జగన్ రెడ్డి పార్టీ మాత్రం బాయ్ కాట్ చేసింది
దేశమంతా ఒక వైపు నిలిస్తే 11 సీట్ల రెడ్డి మరో పక్క నిలవడం దురదృష్టకరం
మావిగన్ అన్నాడు కాబట్టి సరిపోయింది ఎట్లనో పులివెందుల గన్ అనలేదు
మచిలీపట్నం నుంచి గుంటూరుకు బదులు పులివెందుల నుంచి కడప వరకు పెట్టుకోవాల్సింది
వైసీపీనే ఒక గన్ పార్టీ ఒక గొడ్డలి పార్టీ ఇక ఆ పేర్లు పెట్టుకోవడమే కరెక్ట్
ఒక సమయంలో రాజధానిగా అమరావతికి వ్యతిరేకం కాదు అందుకే జగన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారని వైసీపీ సెలవిచ్చింది
ఇప్పుడేమో అమరావతిని వ్యతిరేకిస్తూ పార్లమెంటు నుంచి సిగ్గులేకుండా బాయ్ కాట్ చేశారు
రాజకీయంగా బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు వాటి మిత్రపక్షాలు కూడా ముక్తకంఠంతో అమరావతికి మద్దతు పలికాయి
అమరావతి రైతుల త్యాగాలు వృథా కాలేదు
రైతులందరూ తిరుమలకు పాదయాత్రగా బయలుదేరితే సర్వేపల్లిలో ఆనాడు మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారు
పొదలకూరు సమీపంలో నీడ కోసం వేసిన టెంట్లను పెరికించేశాడు ఆడపడుచులను నేలమీద కూర్చుని బోజనం చేసేలా వేధించాడు
రాజధాని కోసం 29 వేల రైతు కుటుంబాలు 34 వేల ఎకరాలను త్యాగం చేశాయి
అమరావతి కోసం లెక్కలేనన్ని కేసులు పెట్టించుకున్నారు
ఆత్మహత్యలు చేసుకున్నారు పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు..మహిళలని కూడా చూడకుండా కాళ్లతో తొక్కారు
రాజధానిగా అమరావతిని వ్యతిరేకించిన వారందరికీ దేవుడు బుద్ధి చెప్పాడు రైతుల ఘోష్టే వైసీసీకి తగలింది
దేశమంతా అమరావతికి అండగా నిలిస్తే లోక్ సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి బాయ్ కాట్ చేసిన తీరు దురదృష్టకరం
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కేంద్రంగా అమరావతి ఎంపిక జరిగింది
అమరావతికి అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతోంది భారీ భవంతులు రాబోతున్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటుంది.భూముల విలువ పెరుగుతుంది
దేశంలోనే నంబర్ 1 సిటీగా అమరావతి రూపుదిద్దుకోబోతోంది సీఎం నారా చంద్రబాబు నాయుడు అద్భుతమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు
సైబరాబాద్ ను సృష్టించిన చంద్రబాబు నాయుడు చేతిలో అమరావతి ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో త్వరలోనే చూస్తాం అని ఆయన తెలిపారు.