కోట,ఉద్యమవార్త; ఏప్రిల్ 13.
కోట దళితవాడ మరియు నార్త్ గిరిజన కాలనీలలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉన్నాయి వారికి అవసరమైన హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంటే కొంతమంది స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని అవి ఆపాలని కోట పట్టణ బిట్ వన్ ఎంపీటీసీ దారా సురేష్ తెలిపారు సోమవారం కోట మండల తహసిల్దార్ జె జె రావుని కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ లు దారా సురేష్,శంశుద్దీన్ మాట్లాడుతూ వందల మంది ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం ఏర్పాటు చేయబడుతున్న హెల్త్ సెంటర్ ను కొంతమంది రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవాలని చూస్తున్నారని అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఇబ్బంది పెట్టాలని ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ఎస్సీ ఎస్టీలకు అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో 36 లక్షల రూపాయల తో హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయమని తెలిపారు దీంతో దళితవాడ లో హెల్త్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని చూసామని సంబంధిత అధికారులు పరిశీలించారని అన్ని రకాలుగా సరైన స్థల పరిశీలన చేశాకే ముందుకెళ్తున్నామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు మేలు చేస్తుందని తెలిసి కూడా తమ స్వార్థం కోసం మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటివారు ప్రజలకు మేలు చేయలేక అధికారo కోల్పోయారని తెలుసుకోవాలి అని దారా సురేష్,శంశుద్దిన్ తెలిపారు ఇలాంటి వారి మాటలు ప్రజలు ఎవరూ నమ్మొద్దని ప్రజలకు ఉపయోగపడే పనులే కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్,రాష్ట్ర విద్య మరియు ఐటి శాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు,జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తామని మాకు మంచి చేయడమే వచ్చు అని వారు తెలిపారు ఎవరు ఎన్ని కుట్రలు పడిన చివరికి ప్రజలకు మంచే జరుగుతుందని అది గుర్తుంచుకోవాల్సిందిగా వైసిపి నాయకులకు హితవు పలికారు ఈ కార్యక్రమంలో కోట మండలం సోషల్ మీడియా అధ్యక్షుడు మధుబాబు ఉపాధ్యక్షుడు నీలేష్ పాల్గొన్నారు.