udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 9:13 pm Digital Edition : UDYAMA VAARTHA

తెలుగుజాతి ఆత్మగౌరం ఎన్టీఆర్-శ్రీధర్ రెడ్డి.

కోట ఉద్యమ వార్త మార్చి 29

తెలుగు జాతి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు అని కోట మండలం రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కోట మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా కోట మండల రైతు అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోట పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించామని తెలిపారు అలాగే తెలుగువారి ఆత్మగౌరవం కాపాడాలని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు1982మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించారని పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలలకే అధికారంలోకి వచ్చి పేదవారికి కూడు,గూడు,గుడ్డ ఏర్పాటు చేసి,రెండు 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి,పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి,మండల వ్యవస్థను స్థాపించి, మహిళలకు సమాన హక్కు కల్పించి, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు ఎన్టీ రామారావు అని ఆయన తెలిపారు అదే ఆశయంతో తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా క్షేమమే లక్ష్యంగా 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు వారందరూ సగర్వంగా తలెత్తుకొని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన తెలిపారు అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు ఈరోజు వాడ వాడల తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారని ఇది తెలుగు వారందరికీ ఒక పండుగ లాంటిదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్, రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,జిల్లా రైతు అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి,వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్,మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మండల కోశాధికారి షేక్ అక్బర్ బాషా, మండల సోషల్ మీడియా కన్వీనర్ మధుబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.