udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 10:21 am Digital Edition : UDYAMA VAARTHA

తూర్పు కనుపూరు జాతరను రాష్ట్ర పండుగలు మార్చేందుకు కృషి చేస్తా పాసిం సునీల్ కుమార్.

గూడూరు ఉద్యమ వార్త మార్చి 01

గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర కరపత్రం ఆవిష్కరణ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు కనుపూరు జాతర రాష్ట్ర పండుగగా మార్చేందుకు కృషి చేసే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు ఈ జాతర ఎంత వైభవంగా జరుగుతుందని తూర్పు కనుపూరు జాతర మహోత్సవానికి సహాయ సహకారాలు అందించిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అలాగే దేవాలయం అభివృద్ధికి అనాదిగా సహాయపడిన ఎంతోమంది పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు తూర్పు కనుపూరు ఆలయ చైర్మన్ దశదరమిరెడ్డి నేతృత్వంలో ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఎంతో వైభవంగా తిరుమల జరుగుతుందని ఆయన తెలిపారు ఇప్పటికే అధికారులు పర్యవేక్షణలో జాతర సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఎంతో వైభవంగా తిరుణాల జరుపుతామని ఆయన అన్నారు మా తూర్పు కనుపూరు దేవాలయానికి సహకరిస్తున్న మా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి మా భవిష్యత్తు నాయకులు విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు గారికి మమల్ని అందరిని ముందుండి నడిపిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.