udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 5:55 am Digital Edition : UDYAMA VAARTHA

టీడీపీ కార్యకర్తక సుప్రియ కి దశరధరామిరెడ్డి రూ. 10 వేల ఆర్థిక సాయం

కోట ఉద్యమ వార్త మార్చి 8

కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పెద్ద గోవిందపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త సుప్రియ ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందుతుంది గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డి అండగా నిలిచారు.కోట మండలం,కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని పెద్ద గోవిందపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆర్.సుప్రియ గత అక్టోబర్ నెలలో డ్వాక్రా రుణ పని నిమిత్తం బ్యాంకుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడగా,పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించారు.ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. సుప్రియ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్,ఆమెను పరామర్శించి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆయన సూచనల మేరకు ముత్యాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరధరామిరెడ్డి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సుప్రియ కుటుంబానికి భరోసా కల్పిస్తూ,వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10,000 (పది వేల రూపాయల) ఆర్థిక సాయాన్ని దశరధరామిరెడ్డి అందజేశారు.పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు తనకు సహాయం చేసి అండగా ఉన్నందుకు టీడీపీ నాయకులు దశరథ రామిరెడ్డికి ధన్యవాదములు తెలిపిన సుప్రియ మరియు కుటుంబ సభ్యులు
కార్యక్రమంలో కోట మండల తెలుగు యువత అధ్యక్షులు చల్లా సురేష్ కుమార్,గూడూరు నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు వాటంబేటీ చెంగల్ రావు,సిద్దవరం సర్పంచ్ ఇంగిలాల రామయ్య,ఇంగిలాల రామ్మోహన్, కుమారి శివకృష్ణ, ఇంగిలాల శివ, నెల్లిపూడి వెంకటకృష్ణ, దామరపు మురళి, కావాలి వంశీ, ఇతర టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.