గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 7.
టీడీపి కార్యకర్తలకి సీఎంఆర్ఆఫ్ అండ గా ఉంటుందని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తెలిపారు
గూడూరు నియోజకవర్గం మన గూడూరు-మన సునీల్ కార్యక్రమంలో భాగంగా గూడూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు మంగళవారం చిట్టమూరు మండలం టీడీపీ పార్టీ కార్యకర్త కృష్ణపట్నం వెంకటరమణ కుటుంబానికి సీఎంఆర్ఆఫ్” కింద మంజూరు చేసిన 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చెక్కును అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్టమూరు మండలంలో యువదలపతి, యువగళం అధినేత నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్ర చేసే సమయంలో పార్టీ సభ్యత్వం ఉండి,చనిపోయన పార్టీ కార్యకర్త కృష్ణపట్నం వెంకటరమణ కుటుంభం పాదయాత్రలో కలసి ఆర్ధిక సహాయం కోరగా యువనేత మాట ఇచ్చిన ప్రకారం “సీఎంఆర్ఆఫ్” కింద మంజూరు చేసిన 2 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చెక్కును ఆ కుటుంబానికి అందించామని డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తెలిపారు టీడీపీ కార్యకర్తలకి అండగా ఉంటామని లోకేష్ బాబు ఇచ్చిన మాట ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరాశ్రయులకి ఉపయోగ పడుతుందని సునీల్ కుమార్ తెలిపారు.
చిట్టమురు మండల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు మాట్లాడుతూ మా యూవ నాయకులు ఐటి,మరియు విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ బాబు ఈ ఇచ్చిన మాట ప్రకారం మా ప్రియతమ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ చొరవతో టీడీపీ కార్యకర్త కుటుంబానికి అండగా 2 లక్షలు చెక్కుని అందించారని వారి పెద్ద మనసు కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు అలాగే మా మండలం లో ఎంతో మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతు వైద్యం ఖర్చుల కోసం సీఎంఆర్ఆఫ్ క్రింద ఆర్థిక సహాయం అందిస్తూ పేదవారికి అండగా నిలుస్తూ ప్రియతమ నాయకులు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల హృదయాలలో నిలిచి పోయాయి రని ఆయన తెలిపారు.