udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 9:28 am Digital Edition : UDYAMA VAARTHA

జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరించిన హీరో శ్రీ విష్ణు.

నెల్లూరు ఉద్యమ వార్త మార్చి 01

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఆదివారం నెల్లూరులో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కోట మండల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు మధుబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ సుభాష్ గుప్తా ఆధ్వర్యంలో నెల్లూరులో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు అనంతమైన మాట్లాడుతూ ఎన్నో సన్సేషనల్ సూపర్ హిట్ మూవీలు అందిస్తూ ప్రపంచంలోనే ఆశేష అభిమానులను సొంతం చేసుకున్న మా హీరో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ను ప్రతి సంవత్సరం ఆవిష్కరించి అభిమానులకు అందజేస్తామని అందులో భాగంగా 2026 క్యాలెండర్ ని టాలెంటెడ్ యువ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా మా అభిమాన హీరో క్యాలెండర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మేము అడిగిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన శ్రీ విష్ణు కి మా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కోట మండలం సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి రూపేష్ మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు