కోట ఉద్యమ వార్త మార్చి 15
హైదరాబాద్ లో ఘనంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం.
(నేషనల్ కన్జ్యూమర్ రైట్స్)హైదరాబాద్ FTCCI భవనంలో ఘనంగావేడుకలు.ప్రశంసా పత్రాన్ని అందుకున్నDr.తిరుమలశెట్టి కోటేశ్వరరావు.నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులుగారెండోసారి ఎంపిక.జాతీయ వినియోగదారుల హక్కులదినోత్సవాన్నిపురస్కరించుకుని తెలంగాణలోని FTCCI (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ)భవనంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఈకార్యక్రమం నిర్వహించబడిందిఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింత విజయ ప్రతాపరెడ్డి మరియు తెలంగాణ అడిషనల్ డీసీపీ రామదాసు తేజావత్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వినియోగదారులహక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసినందుకు గాను,నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులు గా Dr.కోటేశ్వరరావు అతిధిల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ లో వీరి సేవలను గుర్తించిన చైర్మన్ నాగేశ్వరరావు 2 వ సారి అవకాశం కల్పించారు.ఈ సందర్భంగా జాతీయ వినియోదారుల హక్కుల కమిషన్ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వినియోగదారులు వారి హక్కులు తెలుసుకోవాలని స్వచ్ఛందంగా సేవ చేసే అందుకే ఈ వినియోగదారుల కమిషన్ వచ్చానని నాకు వీలైనంతవరకు వినియోగదారులకు న్యాయం చేసినందుకు పోరాటం చేస్తానని వారిలో అవగాహన కల్పించి సమాజంలో వారు కొనే వస్తువుపై వారికి ఎటువంటి పక్కలో ఉన్నాయో అవి తెలియజేస్తామని తెలిపారు తనకు అవకాశం కల్పించిన కన్జ్యూమర్ రైట్స్ నేషనల్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రతాపరెడ్డికి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.