కావలి ఉద్యమ వార్త ఏప్రిల్ 15.
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా,కావలి నియోజకవర్గం జువ్వల దిన్నెలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా శాసన మండలిసభ్యులు,మాజీ మంత్రులు,మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తో కలిసి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిరు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ కాకాణి పూజిత ను చూడగానే ఆప్యాయంగా పలకరించిన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తో కలిసి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించి,కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు చేసిన కుట్రలను వివరించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి మత్స్యకారుల తో ముఖాముఖి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభ లో పాల్గొని మాట్లాడిన కాకాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన తెలిపారు ఈ ప్రాంత మత్స్యకారుల దశాబ్దాల కలను నిజం చేస్తూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించారు రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మాటలు చెప్పి వదిలేసినా, మత్స్యకారుల కష్టాలను గుర్తించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సాకారం చేసింది ఒక్క జగనన్నేజువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆస్తి, హక్కు దాదాపు పనులు పూర్తయి, వినియోగంలోకి రావాల్సిన హార్బర్‌ను కూటమి ప్రభుత్వం ‘సాగర్ డిఫెన్స్’ అనే ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయడం మత్స్యకారుల పొట్ట కొట్టడమే అని ఆయన అన్నారు
మత్స్యకారులకు భరోసా ఇవ్వడానికే జగనన్న స్వయంగా జువ్వలదిన్నెకు రావడం జరిగిందని జగనన్న గుండె ధైర్యమే మనకు వారసత్వంగా వచ్చింది,ఆ ధైర్యంతోనే ముందడుగు సాగుతాం కూటమి ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా,పోలీస్ లు రానివ్వకుండా అడ్డంకులు సృష్టించినా భయపడకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా తరలివచ్చిన వేలాది మంది మత్స్యకారులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.