udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 9:10 pm Digital Edition : UDYAMA VAARTHA

చిల్లకూరు మండలంలో 400 మంది YCP వారిని టీడీపీలోకి ఆహ్వానించిన-పాశిం సునీల్.

గూడూరు ఉద్యమ వార్త మార్చి 16.

చిలుకూరు మండలం లో వైఎస్సార్ సీపీకి చెందిన 400 మందిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సోమవారం గూడూరు జ్యోతి కాటా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టిడిపిలో చేరిన నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మనగారి పాలెం సర్పంచ్ గిద్దలూరు సుమలత, కమ్మవారిపాలెం సర్పంచ్ చిట్టెటి నారాయణ, యెరూరు MPTC చేవూరు మాధవి మరియి మాజీ MPTC చేవూరు నాగరాజు గార్లను వారితో పాటుగా 400 మందికి మా నాయకుడు పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మెన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ లో చేరే వారు పాత నాయకులతో సమన్వయము చేసుకుని ముందుకెళ్లాలని అన్నారు పార్టీ లో అందరికీ సమూచిత స్థానం కల్పిస్తామని అన్నారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో అందరూ కలసి పనిచేసి పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు గూడూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు