udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 12:00 am Digital Edition : UDYAMA VAARTHA

ఘనంగా అభయ ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు.

కోట ఉద్యమ వార్త మార్చి 10

కోట మండల కేంద్రంలోని శ్యామసుందరపురం కట్టకింద శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు శరవణ స్వామి మాట్లాడుతూ పిలిస్తే పలికే కొంగుబంగారం భక్తులు కోరికలు తీర్చే అంజనీ పుత్రుడు శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామికి ఈరోజు మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు ఈరోజు ఉభయకర్తలుగా కోట పట్టణానికి చెందిన అద్దాల వీరాస్వామి విజయమ్మ దంపతుల ప్రధమ పుత్రుడు అద్దాల శివకుమార్ వారి కుటుంబ సభ్యుల వ్యవహరిస్తున్నారు ఇప్పటికే అద్దాల శివకుమార్ సుమారుగా లక్ష ఇరవై వేల రూపాయలు సొంత నిధులతో ఆలయ నిర్మాణానికి సహాయం చేశారని వారు వారి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు వారికి ఉంటాయని కోరుకుంటున్నట్లు తెలిపారు ఉభయ కర్త అద్దాల శివకుమార్ మాట్లాడుతూ ప్రతినెల రెండవ మంగళవారం ఉభయ కర్తగా వ్యవహరించే అవకాశం రావడం తమ అదృష్టమని శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు తమ కుటుంబంతోపాటుగా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను తెలిపారు.