udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 6:13 am Digital Edition : UDYAMA VAARTHA

గూడూరు రాజయ్యకి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్.

కోట,ఉద్యమ వార్త;ఏప్రిల్ 13.

కోట మండలం కోట లో ఆకుతోట వీధి నందు స్వర్గస్తులైన తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు కిరణ్ తండ్రి గారైన గూడూరు రాజయ్య కి సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారుగూడూరు నియోజక వర్గం శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా గూడూరు రాజయ్య మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోట లోని రాజయ్య నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు గూడూరు రాజయ్య అకస్మాత్మ మరణం చాలా బాధాకరం అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,తమ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడద్దని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,మాజీ మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి,వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధుయాదవ్,పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు,శంషుద్దీన్, దారా సురేష్,కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, జిల్లా పార్లమెంట్ కార్యదర్శి సిద్ధపరెడ్డి పోలమ్మ,కోట మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మధుబాబు తదితరులు పాల్గొన్నారు.