udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 9:14 pm Digital Edition : UDYAMA VAARTHA

గూడూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన-సునీల్ కుమార్.

గూడూరు పట్టణం,ఉద్యమ వార్త; ఏప్రిల్ 03.

రాయల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషా రెడ్డి ప్రాంగణం నందు ఏర్పాటు చేసిన గూడూరు ప్రీమియర్ లీగ్ జిపియల్ క్రికెట్ పోటీలను శుక్రవారం గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాయల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లూరు ఆదిశేషా రెడ్డి స్టేడియంలోగూడూరు ప్రీమియర్ లీగ్ జిపియల్ క్రికెట్ పోటీలు ఏంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆయన తెలిపారు ఈ క్రికెట్ పోటీలను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న రాయల్ లయన్స్ క్లబ్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు చెప్పారు గూడూరులో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, క్రీడాకారులు,పాల్గొననున్నారు.