udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 8:50 am Digital Edition : UDYAMA VAARTHA

గూడలిలో ఘనంగా టిడిపి 44వ ఆవిర్భావ వేడుకలు.

కోట ఉద్యమ వార్త మార్చి 29.

కోట మండలంలోని గూడలి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం, అణగారిన వర్గాలకు అండగా మన తెలుగుదేశం పార్టీ పుట్టి 44 సంవత్సరాలైందని పలిమల్లి వెంకటకృష్ణ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులమైన మనకు ఇది గర్వకారణమైన సందర్భం అని ఆవిర్భావ స్ఫూర్తి,ఐకమత్యం చాటే సమయం ఇది.ఇది ఒక చిత్రం కాదు.రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమ,సకల శుభాల గెలుపుకు సంకేతమైన పసుపు జెండా ప్రస్థానం అని అన్నారు తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గూడూరు శాసనసభ్యులు, డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచన మేరకు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ మార్చి 29 1982 ఒక ప్రభంజనమని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తెలుగువారి సత్తాని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలని రెండు రూపాయల కిలో బియ్యం అందించారని పక్కా గృహాలు జనతా వస్త్రాలు అందించారని ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చారని ఇప్పుడు నవ్యాంధ్ర అభివృద్ధికి పరుగులు పెట్టిస్తున్నారని ప్రజా క్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళుతుందని పలిమల్లి వెంకటకృష్ణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశం కిషోర్,గుండాల మధు యాదవ్,కోట దానయ్య,నల్లూరు గోపాలయ్య కిళ్ల రోహిత్,స్వాముల రెడ్డి నాగమణి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ కేక్ ని కట్ చేసి తెలుగుదేశం శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ పెద్దలు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు.