udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 8:36 pm Digital Edition : UDYAMA VAARTHA

కోట ముస్లింల’స్మశాన వాటిక’సుందరీ కరణ-జలీల్ అహ్మద్. ఎంపి బీదా మస్తాన్ రావు కి విజ్ఞప్తి.

కోట ఉద్యమ వార్త ఏప్రిల్ 4

ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ చొరవతో కోట ముస్లింల’స్మశాన వాటిక’సుందరీ కరణ చేయడమే తమ లక్ష్యం అని జలీల్ అహ్మద్ తెలిపారు శనివారం ఆయనగూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్
సునీల్ కుమార్‌ సమక్షంలోఎంపీ బీద మస్తాన్ రావును కలిసి వినతిపత్రం అందజేతగత ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోమంజూరైన నిధులనుపునరుద్ధరించి, పనులు వెంటనే ప్రారంభించాలని ఎం పి బీదా మస్తాన్ రావు కి విన్నపం చేశారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యం అని జలీల్ అహ్మద్ తెలిపారుముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తానని స్పష్టం అన్నారుసమస్యపై సానుకూలంగా స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యే,జలీల్ అహ్మద్ పోరాటంపై సర్వత్రా హర్షం తెలిపారు,పట్టణంలోని ముస్లిం సోదరుల దశాబ్దాల కల అయిన స్మశాన వాటిక (ఖభరస్థాన్) ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ గట్టి ప్రయత్నంమొదలుపెట్టారు. గూడూరులో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ను గూడూరుశాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సమక్షంలో ఆయనమర్యాదపూర్వకంగా కలిసి,ఈ సమస్యపై వినతి పత్రం సమర్పించారు.​గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు 2014-2019 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ప్రత్యేక చొరవతో కోట పట్టణ ముస్లిం స్మశాన వాటికకు 10 లక్షల నిధులు మంజూరయ్యాయని జలీల్ అహ్మద్ గుర్తు చేశారుగత ప్రభుత్వ ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టేసిందని,ముస్లింల అవసరాలను ఏమాత్రంపట్టించుకోకుండా కాలయాపన చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారుపెండింగ్‌లో ఉన్న ఈ స్మశాన వాటిక పనులనుపునఃప్రారంభించి,తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఎంపీ బీద మస్తాన్ రావు ని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సమక్షంలో జలీల్ అహ్మద్ కోరారు.​డాక్టర్ పాశం సునీల్ కుమార్ సహకారంగతంలోనే ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డ ఎమ్మెల్యే, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దీనిని పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.​ముస్లింల సంక్షేమమే ధ్యేయంకోట పట్టణంలోని ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు కృషి చేస్తానని జలీల్ అహ్మద్ స్పష్టం చేశారు.
​జలీల్ అహ్మద్ పోరాట పటిమపై ​కోట సమస్యలపై  నిరంతరం స్పందిస్తూపార్టీలకూఅతీతంగా ముస్లింలప్రయోజనాల కోసం జలీల్ అహ్మద్ చూపుతున్న చొరవ పట్ల స్థానిక మైనార్టీ నేతలు మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపైసానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.