udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 7:43 am Digital Edition : UDYAMA VAARTHA

కోటలో ఘనంగా 44 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

కోట ఉద్యమ వార్త మార్చి 29.

కోట పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కోట మండలం అధ్యక్షులు భాస్కర్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నినాదంతో హోరెత్తిన కోట పట్టణం.కోట మండల నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ముందుగా రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,ఆంధ్ర రాష్ట్ర అవతరణ పోరాటాల యోధుడు అమరజీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు.అనంతరం కోట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం జెండా ఆవిష్కరించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
అనంతరం 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేకును కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.కోట మండల పార్టీ అధ్యక్షులు
పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఉద్భవించి ఒక ఉద్యమంలా ప్రజల్లో ఉద్వేగం రేపిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రభంజనాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని తెలిపారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ప్రజల ఆశీస్సులతో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ప్రతి పేదవారికి కూడు,గూడు,గుడ్డ ఏర్పాటు చేసి 2/- రూపాయలకే కిలో బియ్యం అందించి, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దుచేసి,మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలను సుభిక్షంగా చూసుకున్న మహా నాయకుడు నందమూరి తారక రామారావు అని ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అనేక సంక్షేమ పథకాలు,ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి ప్రపంచంలోనే తెలుగు వారికి గుర్తింపు తెచ్చారని ఎంతో ఘన కీర్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎస్సి,ఎస్టి,బీసీ మైనార్టీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని వారు తెలిపారు ప్రతి తెలుగు వారు గర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇంత గొప్పగా ప్రపంచమంతా జరుపుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి,వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్,మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి,మాజీ అధ్యక్షులు కోటారెడ్డి,వాక విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు సంశుద్దీన్,దారా సురేష్,మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు,పార్టీ నాయకులు రఘునాథరెడ్డి,రవి రెడ్డి,సుష్మా రెడ్డి,రమేష్ బాబు మర్రిపోలయ్యమిజూరు మల్లికార్జున్,సోషల్ మీడియా అధ్యక్షులు మధుబాబు,తెలుగు యువత అధ్యక్షులు చల్లా సురేష్ బాబు,ఉపాధ్యక్షులు నీలేష్,మురళి, అనూక్,చిరంజీవి,జిల్లా మహిళా కార్యదర్శి సిద్దపరెడ్డి పోలమ్మ, మండల కోశాధికారి అక్బర్ బాషా,తల్లం శ్రీనివాసులు,వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు,వార్డు మెంబర్ సుహాసిని, నాయబ్ రసూల్,తూపిలి నాగేంద్ర,మరియు కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.