udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 9:18 pm Digital Edition : UDYAMA VAARTHA

కోటలో ఘనంగా అంబేద్కర్ 135 జయంతి వేడుకలు.

కోట,ఉద్యమ వార్త;ఏప్రిల్ 14.

కోట పట్టణంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కోట మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి భారీ గజమాల వేసి జోహార్ అంబేద్కర్ నినాదాలుతో ఘన నివాళి అర్పించారు, అనంతరం భారీ కేకును కట్ చేశారు ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ సామాజిక,సమానత్వం,కోసం పోరాడిన మహానేత బి.ఆర్.అంబేద్కర్ అని,సమానఅవకాశాలు,హక్కులు అందించి,ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించిన మహోన్నత నేత అంబేద్కర్ అని అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకుంటున్నారని తెలిపారు అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని తెలిపారు,ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉండి, ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేశారనిఅంబేద్కర్ అంటరానితనం,కుల వివక్ష వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడటమేకాకుండా,మహిళా సాధికారత మరియు కార్మిక హక్కుల కోసం అనేక సంస్కరణలు తెచ్చారని
అంబేద్కర్ 64 సబ్జెక్టులలో పట్టు సాధించి,9 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన అరుదైన మేధావి అని బోధించు,సమీకరించు, పోరాడు”అనే ఆయన నినాదం నేటి యువతకు నిరంతర స్ఫూర్తిదాయకం అని సునీల్ కుమార్ తెలిపారు
స్వతంత్ర భారత తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా సేవలందించి, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు నేటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగ విలువల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారుఆంధ్ర రాష్ట్ర చరిత్రలోఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా మహనీయుడు అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అడుగులు వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు,రాజ్యాంగబద్ధంగా బడుగు,బలహీన వర్గాలకు,రాజకీయ అవకాశం కల్పించడమే కాకుండా,రిజర్వేషన్లకు అతీతంగా మరి ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించి, సామాన్యుడు,బీద, బడుగు,బలహీన వర్గాలకు చెందినవారు, రాజ్యాధికారం వైపు అడుగులు వేసే విధంగా తీసుకున్న చొరవభావితరాలకు ఆదర్శంమహనీయుడు బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం చంద్రబాబునాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు.