కోట ఉద్యమ వార్త మార్చి 5
కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని గోవిందపల్లి గ్రామం లో ఇటీవల మరణించిన గిరిజన కాలనీకి చెందిన కస్తూరమ్మ అనారోగ్య సమస్యతో మరణించడం జరిగింది తదుపరి పెద్దకర్మ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని శ్రీ శ్రీ శ్రీ తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయ ట్రస్ట్ చైర్మన్ దశరథ రామిరెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అనుచరుడు కోట మండల తెలుగు యువత అధ్యక్షులు చల్లా సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రియతమ నాయకులు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ సూచనల మేరకు గోవిందపల్లి గిరిజన కాలనీకి పేద కుటుంబానికి చెందిన కస్తూరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబానికి అండగా ఖర్చులు నిమిత్తం మా పెద్దాయన తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ దశధ రామిరెడ్డి హార్దిక సాయం అందించడం జరిగింది . నియోజకవర్గంలో పేదవారు ఎవరు మరణించిన మా ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ ఆ మండలాలలోని నాయకుల ద్వారా వారి కుటుంబానికి అండగా నిలబడేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు అలాగే మా పెద్దాయన దశరథ రామిరెడ్డి మా కొత్తపట్నం పంచాయతీలో ఏ పేదవారికి కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుంటారు ఆయనకి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.