udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 7:40 pm Digital Edition : UDYAMA VAARTHA

కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

వాకాడు,ఉద్యమ వార్త మార్చి 26.

మేలుకో వినియోగదారుడా మేలుకో నినాదం తో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం వాకాడు మండలం గంగన్న పాలెం లో గురువారం జరిగింది ఈ సందర్భంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్యంలో జరిగిన కార్యక్రమంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం మరియు షుగర్ బీపీ వ్యాధుల నిర్ధారణ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు,అనంతరం కంటి ఆపరేషన్ అవసరమైన వారిని నెల్లూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ కి తీసుకెళ్లారు అలాగే దగ్గర,దూరపు చూపు లోపం ఉన్నవారికి కంటి అద్దాలు ఉచితంగా అందిస్తామని చెప్పారు.నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ రాష్ట్ర పరిశీలకులు డా,,తిరుమల శెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ
ప్రతి ఒక్క వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని గుండుసూది నుంచి విమానం వరకు కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద హక్కు ఉందని ఆ హక్కును ఎలా వినియోగించుకోవాలి తెలియజేసేందుకు సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నామని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు,మరియు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి దామా విజయ్ కుమార్ సూచనలు మేరకు ఈరోజు కంటి శిబిరాన్ని ఏర్పాటు చేశామని అలాగే ఈ కమిషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సదుద్దేశంతో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కిరణ్ కుమార్ రెడ్డి సహకరించిన
ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ వారికి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నేషనల్  కన్జ్యూమర్ రైట్స్ నెల్లూరు జిల్లా వైస్ చైర్మన్ మీజూరు మధుబాబు పాల్గొన్నారు.