udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 12 April 2026, 12:52 am Digital Edition : UDYAMA VAARTHA

ఎమ్మెల్యే సోమిరెడ్డి తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం – మన్నెం జితేంద్ర గౌడ్ ఆనందం వ్యక్తం

తోటపల్లి గూడూరు, ఏప్రిల్ 12;ఉద్యమ వార్త.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని, అలాంటి మహత్తర అవకాశాన్ని శాసనసభ్యులు, ప్రజా నాయకులు, నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి పొందడం తన అదృష్టమని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మన్నెం జితేంద్ర గౌడ్ తెలిపారు.తిరుమల గిరులపై నామస్మరణతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణం తన మనసుకు అపారమైన ప్రశాంతతను అందించిందని ఆయన పేర్కొన్నారు.ఆలయ ప్రాంగణంలో సోమిరెడ్డి గారితో కలిసి నడిచిన సందర్భంలో,భక్తుల పట్ల ఆయనకున్న గౌరవం,స్వామి పట్ల భక్తి,సామాన్య ప్రజలతో మమేకమయ్యే తత్వం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని జితేంద్ర గౌడ్ వెల్లడించారు. ఆనంద నిలయం ముందు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్నప్పుడు కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేనిదని తెలిపారు. పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య హారతి వెలుగులో స్వామివారిని దర్శించడం ఒక అపూర్వ అనుభూతిగా నిలిచిందని చెప్పారు.ఈ దర్శనంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మి సురేంద్ర, కెనాల్ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మండల అధ్యక్షులు కొణతం రఘుబాబు, సొసైటీ చైర్మన్ సన్నా రెడ్డి సురేష్ రెడ్డి, వరిగొండ తెలుగుదేశం నేత చిన్నబాబిరెడ్డి, నీటిసం అధ్యక్షులు ఈదూరు బాబు నాయుడు,మాజీ నీటి సంఘ అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ తదితర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లోక కల్యాణం కోసం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.గోవిందా.. గోవిందా!