udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 9:21 am Digital Edition : UDYAMA VAARTHA

ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా స్వయం సహాయక గ్రూపులకు 56 లక్షలు చెక్.

కోట ఉద్యమ వార్త మార్చి 9.

కోట మండల కేంద్రంలోని తిన్నెలపూడి గ్రామం నందున్న 3 స్వయం సహాయక గ్రూప్ లకు బ్యాంక్ లింకేజ్ ద్వారా మంజూరు అయినా 56 లక్షల రూపాయలు చెక్ లను పొదుపు గ్రూప్ సభ్యులకు అందించిన సోమవారం గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ప్రచాదరణ పొందిన పథకం పొదుపు మహిళల స్వయం సహాయక పొదుపు సంఘం అని ఆయన అన్నారు ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ఇష్టమైన ఈ పొదుపు పథకం ద్వారా లక్షలాదిమంది మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారని ఆయన చెప్పారు మహిళల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఇప్పటికే మహిళలకు ఎన్నో పథకాలు అందించామని వాటిలో ఉచిత బస్సు ప్రయాణం మహిళాదరణ పొందిన పథకం అని అలాగే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి మహిళలు జేజేలు పలుకుతున్నారని అలాగే పొదుపు మహిళలు ప్రభుత్వం ఇచ్చే రుణాలు ద్వారా ఆర్థిక పారిశ్రామికవేత్తలుగా నిలదొక్కుకోవాలని మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి,మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్,కోట మండల మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, కోటారెడ్డి,ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల, మండల రైతు కార్యదర్శి మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి,కోట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు షంషుద్దీన్,దారా సురేష్,AMC డైరెక్టర్ సిద్ధప్పరెడ్డి పోలమ్మ, కోట మండలం సోషల్ మీడియా అధ్యక్షుడు మీజురు మధుబాబు,వార్డ్ మెంబర్ సుహాసిని తదితరులు పాల్గొన్నారు.