కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 02.
విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు, గురువులు పడుతున్న అవస్థలు చూడలేక ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో SC గురుకుల పాఠశాల కు కోటి రూ/- సీసీ రోడ్లు వేయడం నా అదృష్టం అని జలీల్ అహ్మద్ తెలిపారు గురువారం కోట పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాల లో
గురుకుల పాఠశాలకి రోడ్లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినందుకు
ఉపాధ్యాయులు విద్యార్థులు జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ కి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ37 ఏళ్ల మా అవస్థలకి దారి చూపిన మహనీయులు
రోడ్లు,కరెంట్ ఏర్పాటు చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్,జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ కి వేల వేల కృతజ్ఞతలు చెపుతున్నామని అన్నారు 37 సంవత్సరాలుగా
రోడ్లు లేక,కరెంట్ సరిగా లేక నరకం అనుభవించామని
బురద రోడ్లు ముళ్ళ చెట్లు పాములు విష సర్పాలు భయం భయం కాలం గడిపామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇన్ని సంవత్సరాలకు మా విద్యార్థులకు మంచి రోజులు వచ్చాయని ఆయన తెలిపారు మా ఆనందాన్ని తెలియజేయడానికి ఈ చిరు సత్కారమని ఆయన అన్నారు అలాగే ఒక్కసారి గురుకుల పాఠశాల కి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ని తీసుకురావసిందిగా జలీల్ అహ్మద్ ని కోరారు. అనంతరంఅనంతరం విద్యార్థులుఉపాధ్యాయులుజలీల్ అహ్మద్ ని
ఘనంగా సన్మానించారు అనంతరం జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఓట్లుకోసం చూడలేదువిద్యార్థుల భవిష్యత్ కోసం భావి తరాల కోసం గురుకుల పాఠశాల కి రోడ్లువేయాలి అనిపించిందని
గురుకుల పాఠశాలకి వెళ్లే మార్గంలో ఒక్క ఇళ్ళు లేదుకదా కోటి రూపాయల తో రోడ్లు ఎందుకు వేయాలని చాలామంది విమర్శలు చేశారని జలీల్ అహ్మద్ అన్నారు.రేపటి భవిష్యత్ తరాలకు వారధి,సారథులు ఈ విద్యార్థులు వారికోసం ఏమైనా చేయాలి అనిమా ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారని
జలీల్ అహ్మద్ అన్నారు మొహంలో సంతోషంతో చూసి నా జన్మ ధన్యమైంది
SC గురుకుల పాఠశాల కి వెళ్లే రోడ్లు వేసేందుకు సహకారాన్ని అందించిన మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి జీవితాంతం ఋణపడి ఉంటానని జలీల్ అహ్మద్ తెలిపారు.