udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 8:56 am Digital Edition : UDYAMA VAARTHA

ఎమ్మెల్యే డా!! పాశిం సునీల్ కుమార్ చేతుల మీద ఘనంగా పాసుబుక్ పంపిణీ.

కోట ఉద్యమ వార్త మార్చి 9.

మండల కేంద్రంలోని తిన్నెలపూడి పంచాయతీ లో సోమవారం గూడూరు శాసన సభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ చేతుల మీద పట్టాదారు పాసుబుక్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ముందుగా ఈ కార్యక్రమంలో కోట మండల నాయకులు ఆధ్వర్యంలో విద్యానగర్ నుండి ఎమ్మెల్యే భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో తహశీల్దార్ జె జె రావు ఆధ్వర్యంలో రైతులకు పాస్ బుక్ పంపిణీ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా!! పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు గత వైసిపి ప్రభుత్వం జరిగిన తప్పులను సరిదిద్ది రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆశేష ప్రజానీకం నుండి మద్దతు లభిస్తుందని నియోజకవర్గం మొత్తం మీద 7438 పాస్ పుస్తకాలు కోట మండలంలో 885 పంచాయతీలో 245 పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు తిన్నెలపూడి పంచాయతీలో కనిపిస్తున్న రోడ్లు డ్రైనేజీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిందని గడిచిన ఐదేళ్ల వైసిపి ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కూడా జరగలేదని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకాల సంక్షేమ పథకాలు అందించామని ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేస్తున్నారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ,ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనము అందజేశామని కోట్లాది రూపాయలు పొదుపు మహిళలకు ఆర్థిక సహాయం అందించడం చేస్తున్నారని ప్రజలు తెలుసుకోవాలన్నారు రైతుల పాస్ పుస్తకాలు వైసిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారని లోన్లు కూడా అవసరాల నిమిత్తం లోన్లు కూడా తీసుకునే పరిస్థితి లేదని ఇవి గమనించే చంద్రబాబు నాయుడు రైతుల ఆస్తి రైతులు దేనిని ఎవరి ఫోటో ఉండాల్సిన అవసరం లేదని పాస్ పుస్తకాలపై రాజముద్రను ముద్రించి వారికి అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి,మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ,ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల,వెంకన్నపాలెం సర్పంచ్ కోకోర్ల మధు యాదవ్,టిడిపి కోట మండలం మాజీ అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి, పాదర్తి కోటేశ్వరరావు,కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు దారా సురేష్,శంషుద్దీన్, మైనార్టీ నాయకులు నౌషద్ భాష, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుపిలి రాధాకృష్ణారెడ్డి,తిరుపతి జిల్లా కమిటీ కార్యనిర్వాక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి, చిట్టేడు సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు,పల్లె మల్లు వెంకటకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి సిద్దపరెడ్డి పోలమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకురాలు గండవరం సుష్మారెడ్డి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాటoభేటీ చెంగల్ రావు కోట మండలం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు మీజురు మధు బాబు,కోట మండలం యువత అధ్యక్షులు చల్లా సురేష్,తెలుగుదేశం పార్టీ నాయకురాలు సుహాసిని,సోషల్ మీడియా ఉపాధ్యక్షులు పునమల్లి నీలేష్,పార్టీ సీనియర్ నాయకులు గూడూరు కిరణ్, కర్లపూడి కోటేశ్వరరావు,నాగేంద్ర,దామరపు బాబు, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.