udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 11:47 pm Digital Edition : UDYAMA VAARTHA

ఎమ్మెల్యే కు తృటిలో తప్పిన ప్రమాదం ప్రజల దీవెనలే కాపాడాయి-సునీల్ కుమార్.

గూడూరు ఉద్యమ వార్త మార్చి 12

గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ కి తృటిలో ప్రమాదం తప్పింది ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా శాసనసభ్యులు సునీల్ కుమార్ రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి వెళ్లి లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికి కాన్వాయ్ లో తిరిగి వస్తుండగా దురదృష్టవశాస్తూ ఆయన ప్రయాణిస్తున్న కారు ముందున్న కారు బ్రేక్ వేయడంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కారుకి ప్రమాదం సంభవించింది అయితే కారు దెబ్బతినింది గాని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి మరియు కారులో ప్రయాణిస్తున్న మిగతా వారికి కానీ ఏమీ ప్రమాదం జరగలేదని ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి ప్రజల ఆశీస్సులు కారణమని శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలిపారు ఈ సంఘటన తెలుసుకున్న నియోజకవర్గ నాయకులందరూ సునీల్ కుమార్ కు ఫోన్ చేసి వివరాలకి తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
లోకేష్ బాబు
నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా లోకేష్ బాబు కాన్వాయ్ లో అల్లూరు- సున్నపు బట్టి రోడ్ దగ్గర గూడూరు శాసన సభ్యులు పాశిం సునీల్ కుమార్ వెహికల్ ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి జరగలేదు,వెహికల్ మాత్రం డ్యామేజ్ అయినది నియోజకవర్గ వ్యాప్తిగా ప్రజలందరూ ప్రమాద విషయం తెలుసుకొని ఆందోళన చెందారు ఎమ్మెల్యేకు ఏమీ కాలేదన్న విషయం తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.