udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 11:08 am Digital Edition : UDYAMA VAARTHA

ఉప్పు కాలవలో మృతదేహం వెలికితీత… గుర్తింపులో మిస్టరీ


తోటపల్లి గూడూరు,ఉద్యమ వార్త; ఏప్రిల్ 19.

మండలంలోని కొత్తపట్టపుపాలెం సమీపంలో ఉన్న ఉప్పు కాలవలో ఆదివారం సాయంత్రం ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కాలవ నుంచి బయటకు తీశారు.మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. అతని ఎడమ చేతిపై “గిరిజ” అనే పేరుతో పచ్చబొట్టు ఉండటం గమనార్హం. గోధుమ రంగు ఫుల్ షర్ట్‌పై బ్లూ, పింక్ రంగుల పూల డిజైన్, లోపల తెల్లటి బనియన్, నల్లటి నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి గుర్తింపునకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పరిసర ప్రాంతాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ వ్యక్తి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.