udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 10:17 pm Digital Edition : UDYAMA VAARTHA

ఉద్యమాలతో చంద్రబాబు కళ్లు తెరిపిస్తాం-కాకాణి గోవర్ధన్ రెడ్డి.

నెల్లూరు,ఉద్యమ వార్త; ఎప్రిల్ 26.

ఉద్యమాలతో చంద్రబాబు కళ్లు తెరిపిస్తాం అని మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు ఆదివారం నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రెండేళ్ల‌లో రైతుల‌కు రూ. 25 వేల కోట్ల న‌ష్టం పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర లేదు న‌ష్ట ప‌రిహారం ఊసే లేదు. ఇప్ప‌టికీ వ్య‌వ‌సాయం దండ‌గ అనే ఆలోచ‌న‌తోనే చంద్ర‌బాబు పాల‌న‌ ఉందని అన్నారు. రైతులు క‌ష్టాల్లో ఉంటే మంత్రులు విదేశీ టూర్ల‌తో జ‌ల్సాలా మొక్క‌జొన్న రైతుల ఇబ్బందులు ఈ ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా
మ‌ద్ధ‌తు ధ‌ర‌లు లేక ఒక్కో ఎక‌రాకు రూ. 20 వేలు న‌ష్టం వస్తుంది. త‌క్ష‌ణం రైతుల‌ను ఆదుకోక‌పోతే వైయ‌స్సార్సీపీ చూస్తూ ఊరుకోదు చెవిడి, గుడ్డి ప్ర‌భుత్వానికి ఉద్యమాల‌తో బుద్ధి చెబుతాం అని ఆయన హెచ్చ‌రిక‌ చేసారు పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక‌,ప్ర‌భుత్వం నుంచి పంట న‌ష్ట‌ప‌రిహ‌రం అంద‌క కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక రెండేళ్ల‌లో రైతులు ఏకంగా రూ. 25 వేల కోట్లు న‌ష్ట‌పోయార‌ని గోవ‌ర్ధ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. నాలుగోసారి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబులో మార్పు రాలేద‌ని,ఇప్ప‌టికీ వ్య‌వ‌సాయం దండ‌గ అనే విధానాల‌తోనే ప‌నిచేస్తున్నాడ‌ని ఆరోపించారు గ‌తేడాది ప‌త్తి, పొగాకు,మిర్చి సాగు చేసిన రైతుల‌కు గిట్టుబాబు ధ‌ర‌లు అంద‌క ఎక‌రాకు రూ. 5 ల‌క్ష‌ల మేర భారీగా న‌ష్ట‌పోయార‌ని, దీంతో ప్ర‌భుత్వ సూచ‌న‌తో వారంతా మొక్కజొన్న సాగుచేశార‌ని చెప్పారు. ప్ర‌భుత్వం చెప్పిన పంట‌లు సాగుచేసినప్ప‌టికీ వారికి అండ‌గా మ‌ద్ధ‌తు ధ‌ర‌కు పంట‌లు కొనుగోలు చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఒకప‌క్క రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోయామ‌ని అల్లాడుతుంటే మంత్రులు విదేశాల్లో జ‌ల్సాలు చేస్తున్నార‌ని మాజీ మంత్రి కాకాణి విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా త‌క్ష‌ణం స్పందించి రైతుల‌ను ఆదుకోక‌పోతే ఈ చెవిటి, గుడ్డి ప్ర‌భుత్వానికి రైతు ఉద్య‌మాల‌తో వైయ‌స్సార్సీపీ బుద్ధి చెబుతుంద‌ని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు. ఆయ‌న ప్ర‌భుత్వానికి రైతుల గోడు ప‌ట్ట‌డం లేదు తాము పండించిన పంట‌ల‌కు గిట్టుబాదు ధ‌ర‌లు లేక అన్న‌దాత‌ల ఆక్రంద‌న‌లు మిన్నంటుతుంటే కూట‌మి ప్ర‌భుత్వం క‌నీసం ప‌టించుకోవ‌డం లేదు. రైతుల క‌ష్టాన్ని దళారులు దోచుకుతింటుంటే ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు చీమ కుట్టిన‌ట్టు కూడా ఉండ‌టం లేదు.న‌ష్టాల పాల‌వుతున్న రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే చంద్ర‌బాబుకి ప‌ట్టడం లేదు.బిజినెస్ రిఫార్మ‌ర్ అవార్డు పేరుతో మీడియాలో ఊద‌ర‌గొట్ట‌డం మిన‌హా రాష్ట్ర ప్ర‌జ‌ల బాగోగులు ప‌ట్టించుకున్న‌పాపాన పోవ‌డం లేదు.మ‌ద్ధ‌తు ధ‌ర ప్ర‌క‌టించి ఊరుకుంటున్నాడే కానీ ఆ ధ‌ర‌కు కొనుగోళ్లు జ‌రుగుతున్నాయో లేదో ప‌ట్టించుకోవ‌డం లేదు. కేంద్రం ఆదుకోవాల‌ని లేఖ‌లు రాసేసి చేతులు దులిపేసుకుంటున్నాడు. రెండేళ్ల కూటమి పాల‌న‌లో రైతుల ఆవేద‌న అరణ్య రోద‌న‌గానే మిగిలిపోయింది. అమ‌రావ‌తి త‌ప్ప చంద్ర‌బాబు క‌ళ్ల‌కు ఏమీ క‌నిపించ‌డం లేదని రైతులు ఇబ్బంది ప‌డుతుంటే వ్య‌వసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు విదేశాల‌కు విహార‌యాత్ర‌ల‌కు వెళ్తున్నారు అని ఆయన తెలిపారు.