కోట ఉద్యమ వార్త ఏప్రిల్ 1.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఒక ఉద్యమం లా అర్హులైన పేదలకు సామాజిక పెంక్షన్ పంపిణీ చేస్తుందని కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు తెలిపారు కోట పంచాయతీ లో బుధవారం జరిగిన పెంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజునుండి ప్రతినెలా క్రమం తప్పకుండా అర్హులైన పేదలకు సామజిక పెంక్షన్ పంపిణీ చేస్తుందని.ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలుపుతున్నామనిఅన్నారు.గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ అదేశాలు మేరకు ఈ కార్యక్రమంలో అధికారులతో కలసి
మా జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ నేతృత్వంలో కోట పంచాయతీ లో పెంక్షన్ పంపిణీలో పాల్గొనడం జరిగింది అని ఆయన తెలిపారు ప్రతి నెల 1 తేదీ పెంక్షన్ ఇవ్వడానికి మేము పంచాయతీ లో తిరుగుతుంటే మాకు ప్రజా సమస్యలపై అవగాహన వస్తుందని తద్వారా ఆ సమస్యలు పరిష్కరించడానికి మాకు అవకాశం ఉందని అన్నారు. ఆనాడు మా తెలుగుదేశం పార్టీ వ్యస్థాపకులు నందమూరి తారకరామారావు ప్రేవేస పెట్టిన పెంక్షన్కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు 4 వేలు,6 వేలు,10 వేలు,15 వేలు రూపాయలు చొప్పున వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి అందిస్తూ వారి ఇంటి పెద్ద కొడుకుగా పేద ప్రజల మనసులో నిలిచిపోయాయి
ప్రజలు కూటమి ప్రభుత్వానికి,చంద్రబాబు నాయుడు కి, సునీల్ కుమార్ కి,జలీల్ అహ్మద్ కి కృతజ్ఞతలు తెలిపారు అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కార్యదర్శి సిద్ధపరెడ్డి పొలమ్మ, ఎంపీటీసీ శంసుద్దీన్,మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మీజురు మధుబాబు,టీడీపీ బూత్ ఇంచార్జి లు తల్లం శ్రీనివాసులు, ముసునూరు మునిరాజ, నందం మోహన్,సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి రూపేష్ పాల్గొన్నారు.