udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 5:11 am Digital Edition : UDYAMA VAARTHA

ఈదురు కొండయ్య మృతికి సంతాపం తెలిపిన-నెల్లూరు మోహన్ రెడ్డి.

ఉద్యమ వార్త కోట ఫిబ్రవరి 25

కొత్తపాలెం గ్రామానికి చెందిన ఈదురు కొండయ్య బుదవారం మరణించారు ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపం తెలుపుతూ గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ సహకారంతో కొత్తపాలె గ్రామం నందు స్వర్గస్తులైన ఈదురు కొండయ్య భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి
ఈదురు కొండయ్య కుటుంబానికి మట్టి ఖర్చులకు 5 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన రైతు విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి & పెన్నా చెరువు ఆయకట్టు నీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ
నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో నందు ఎవరికి ఏ సమస్య ఉన్న ఎవరు ఇబ్బంది పడకుండా నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో నెల్లూరు మోహన్ రెడ్డి వెంట టిడిపి సీనియర్ నాయకులు శానంపూడి గోపాల్ రెడ్డి,నేదురుమల్లి కిరణ్ కుమార్ రెడ్డి,మురళి రెడ్డి,పెనుబోలు ప్రభాకర్ రెడ్డి,బూత్ కన్వీనర్ గుండాల సుబ్రహ్మణ్యం,మదన్ మరియు తదితరులు పాల్గొన్నారు