కోట,ఏప్రిల్ 2 ఉద్యమ వార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో కోట మండల పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండలం కేంద్రంలో ని
గోపాల్ రెడ్డి బొమ్మ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ 5 కోట్ల ఆంద్ర రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న అమరావతి ని రాజధానిగా నిలబెట్టేందుకు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ విజయానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఐ,టి మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకిహృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.అలాగే రాజధాని సాధించడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామనిఅన్నారు ఈ కార్యమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచుతూ సంబరాలను కొనసాగించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి, వెంకన్నపాలెం సర్పంచ్ కొకర్ల మధు యాదవ్,మాజీ అధ్యక్షుడు కోటా రెడ్డి,వాకా విజయభాస్కర్ రెడ్డి,జిల్లా మహిళా కార్యదర్శి సిద్ధపరెడ్డి పొలమ్మ,ప్రధాన కార్యదర్శ తిరుమల శెట్టి కోటేశ్వరరావు వెంకట కృష్ణారెడ్డి, కోటా రెడ్డి,ఎంపీటీసీ శంషుద్దీన్,దార సురేష్,నియోజకవర్గ ఎస్సీ సెల్ చెంగల్ రావు,టీడీపీ సీనియర్ నాయకుడు మీజురు మల్లికార్జున్,మండల మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్ బాషా,మండల యువత అధ్యక్షులు చల్ల సురేష్ బాబు,కిష్టయ్య,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి రూపేష్,బూత్ ఇంఛార్జి తల్లం శ్రీనివాసులు,నందం మోహన్,తుపిలి నాగేంద్ర,ముసునూరు వంశీకృష్ణ,నేతలు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.