తోటపల్లి గూడూరు, ఏప్రిల్ 2 ఉద్యమ వార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో తోటపల్లి గూడూరు మండల పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండలంలోని నరుకూరు సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా నిలబెట్టేందుకు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ విజయానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,సియం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచుతూ సంబరాలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొణతం రఘుబాబు, ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్ర గౌడ్, పొట్లపూడి నేతలు భరత్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటేశ్వర్లు. అరికాటి వెంకటేశ్వర్లు, సుమంత్ రెడ్డి,పాకం వెంకయ్య తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.